మమత బెనర్జీకి మరో షాక్

by  |
మమత బెనర్జీకి మరో షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: తృణమూల్ కాంగ్రెస్‌ను వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది. గోరు చుట్టు మీద రోకలి పోటు అన్నట్టు మంత్రుల, ఎమ్మెల్యేల రాజీనామాలతో ఇప్పటికే పరేషాన్‌లో ఉన్న ఆమెకు తాజాగా మరో షాక్ తగిలింది. తాజాగా బీజేపీ గూటికి చేరేందుకు ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురు నాయకులు రెడీ అయ్యారు. ఈ మేరకు అమిత్ షా ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. వీరంతా ఆదివారం హౌరాలో జరిగే అమిత్ షా ర్యాలీలో పార్టీలో చేరాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శనివారం ఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో ఆమిత్ షా ఆద్వర్యంలో బీజేపీలో చేరుతుండటం గమనార్హం. బీజేపీలో జాయిన్ అవుతున్న వారిలో మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ, బాలీ ఎమ్మెల్యే బైశాలి దాల్మియా, ఉత్తర పారా ఎమ్మెల్యే ప్రబీర్ గోషల్, హౌరా మేయర్ రతిన్ చక్రవర్తి, సీనియర్ నేత, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రణగాట్ పార్థ ఉన్నారు

Next Story