నాగర్ కర్నూలు లో మరో పాజిటివ్ కేసు 

by  |
నాగర్ కర్నూలు లో మరో పాజిటివ్ కేసు 
X

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మధురానాగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి కరోనా బారిన పడ్డారు. గత 8 రోజుల క్రితం అతను ఢిల్లీ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గత రెండు మూడు రోజుకుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా అతనికి కరోనా అని నిర్ధారణ అయ్యింది. అయితే గడిచిన వారం రోజులుగా బాధితుడు ఎవరెవరిని కలిశారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అచ్చంపేటలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పట్టణ వసూలు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed