బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తీర ప్రాంతాలకు హెచ్చరిక

by  |
bengal-sea hypotenstion
X

దిశ, వెబ్‌డెస్క్ : నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నమోదైంది. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా, గ్యాంగ్ టక్, వెస్ట్ బెంగాల్‌ను అనుకుని అప్పపీడనం కొనసాగుతోంది.

మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story

Most Viewed