ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అంకిత రైనా ఔట్

by  |
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అంకిత రైనా ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా గ్రాండ్‌స్లామ్ కల మరోసారి చెదిరిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో చివరి మ్యాచ్ మ్యాచ్ వరకు చేరుకొని అందరి దృష్టిని ఆకర్షించిన అంకిత… ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం ఫామ్‌ను కొనసాగించలేక పోయింది. మే 24న ప్రారంభమైన క్వాలిఫయింగ్స్ రౌండ్ మొదటి దానిలో గెలిచిన రైనా.. రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన జర్మన్ ప్లేయర్ గ్రీట్ మిన్నెన్‌పై రైనా చిత్తుగా ఓడిపోయింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అంకిత కేవలం రెండు గేమ్స్ మాత్రమే గెలుచుకోవడం గమనార్హం. మొత్తానికి వరల్డ్ 125వ ర్యాంకర్ అంకిత రైనా 2-6, 0-6 తేడాతో ఓడిపోయి ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. అంకిత ఇప్పటి వరకు ఏడు గ్రాండ్ స్లామ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడినా ఇంత వరకు దేంట్లోనూ ముందంజ వేయలేదు.

Next Story