డియర్ రిషి.. మిస్ యూ

by  |
డియర్ రిషి.. మిస్ యూ
X

రిషి కపూర్ … ఇండియన్ సినిమా లెజెండ్. భారత చలచిత్రం పై తన హవా కొనసాగించిన ఒక అధ్యాయం. కానీ… ఆయన మనకు దూరమయ్యారు. లుకేమియా వ్యాధితో పోరాడి ఓడాడు. ఈ సందర్భంగా సినీ ప్రేమికులకు స్పూర్తి అయిన రిషి కపూర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు అనిల్ కపూర్. నువు లేకపోయినా… నువు కోరినట్లుగా నీ లైఫ్ ను సెలబ్రేట్ చేస్తాను మాట ఇచ్చాడు.

మై డియర్ జేమ్స్…

ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియట్లేదు… ఇద్దరం కలిసి పెరుగుతున్న క్రమం నుంచి… వెండితెరపై మన కలలు సాకారం చేసుకునే వరకు.. ఇద్దరం ఒకరికి ఒకరం ఉన్నాము… నువు నాకు పెద్దన్న లాంటి వాడివి, సపోర్ట్ అవసరం ఉన్న సమయంలో భుజంపై చేయేసి నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చావు… మెంటర్ గా ప్రోత్సాహం అందించావు… ఒక మిత్రుడిగా ఎప్పుడూ నాతోనే ఉన్నావ్… నాకు, నా కుటుంబానికి గొప్ప ప్రేమను అందించావు.. నువు నా తల్లికి కొడుకు లాంటి వాడివి… అన్నిటికీ మించి సినిమా ప్రేమికులకు నువు ఒక స్ఫూర్తి ప్రదాత.. ప్రతీ రోజూ నిన్ను మిస్ అవుతుంటా… నువు లేకుండా జీవితం ఒకేలా ఉండదు… కానీ నువు కోరుకున్నట్లుగా నీ జీవితం నేను సెలబ్రేట్ చేసుకుంటాను… ఎప్పటికీ నీ పాటన్…

Tags : Rishi Kapoor, Anil Kapoor, Bollywood, Friend, Well wisher

Next Story

Most Viewed