- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అలర్ట్.. ఆ ప్రాంత చిన్నారుల్లో రక్తహీనత
దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ ప్రాంత చిన్నారులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత చిన్నారులు అధిక రక్తహీనతతో బాధపడుతున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (ఎన్‌ఐఎన్) ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో చేపట్టిన పరిశోధనల్లో రక్తహీతన ఎక్కువగా ఉండటం, ఐరన్ శాతం తక్కువగా ఉండటం వంటి పలు అంశాలను గుర్తించామని తెలిపారు. దేశంలో దాదాపు 40-50% మంది మహిళల్లో, పిల్లల్లో ఈ సమస్యలున్నాయని వివరించారు. పోషాకాహారాలలోపం , తరచూ అనారోగ్యానికి గురికావడం వలన ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. 2016-18 మద్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జర్నల్ ఆఫ్ న్యూట్రిషియన్ అనలైజుడ్ సంస్ధ కాంప్రెసీవ్ నేషనల్ న్యూట్రిషియన్ సర్వే ద్వారా చిన్నారుల్లో, పడుపు వృత్తిలో ఉన్న బాలికల్లో రక్త నమూనాలను సేకరించిందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపుగా 33,000 వేల మందికి రక్త పరీక్షలు నిర్వహింంచి 30 నుంచి 32శాతం మంది రక్తహీతతో బాధపడుతున్నారని నివేధికలు సమర్పించినట్టుగా చెప్పారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 5 నుంచి 9ఏళ్ల మద్యవయసున్న చిన్నారులు 11 నుంచి 15శాతం వరకు ఉన్నారని వివరించారు. పోకాహారం లోపం కారణంగానే చిన్నారుల్లో ఈ పరిస్ధితులు నెలకొన్నట్టుగా సంస్థకు చెందిన ప్రముఖ డాక్టర్ కులకర్ణీ నివేధికలు సమర్పించారని తెలిపారు.