మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు

by Mahesh |   ( Updated:2025-04-16 06:05:24.0  )
మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కు ఏపీ పోలీసులు (AP Police) షాక్ ఇచ్చారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ముసిక్ డైరెక్టర్లు.. మ్యూజికల్ కాన్సర్ట్ (Musical concert) పేరుతో భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను వివిధ సంస్థలు, ఆర్ఫన్ హోమ్స్‌కు విరాళం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ నెల విశాఖపట్టణంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ (Vishwanatha Sports Club) లో మ్యూజికల్ కాన్సర్ట్‌కు ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాంకి విశాఖ పోలీసులు పర్మిషన్ (Police permission) ఇవ్వలేదు.

భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమన్న సీపీ శంకబ్రత బాగ్చి (CP Shankarbhata Bagchi) చెప్పారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌ వాటర్ వరల్డ్‌లో ఇటీవల ఓ బాలుడు మునిగి చనిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో దేవీశ్రీ ప్రసాద్ ప్రోగ్రామ్ అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ షో కి సంబంధించి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో ఆన్ లైన్‌లో టికెట్లను కూడా విక్రయించారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో దేవీశ్రీ ప్రసాద్ తో పాటు నిర్వాహకులు, టికెట్లు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed