Nara Lokesh: కడపలో 10 సీట్లు గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం

by srinivas |
Nara Lokesh: కడపలో 10 సీట్లు గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తాం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 116వరోజు కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. భూమయ్యపల్లెలో బలిజ సామాజిక వర్గీయులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ మాట్లాడుతూ బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారన్నారు. రాయలసీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదన్నారు. కడప జిల్లా ప్రజలు వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించారు. సీఎం సొంత జిల్లా అంటే ఎలా అభివృద్ది చెందాలని, కేవలం జయంతి, వర్ధంతికి తప్ప కడప జగన్‌కి గుర్తు రావడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టీడీపీకి ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. పాదయాత్రతో దారిపొడవునా వివిధవర్గాల ప్రజలు, దళితులు, రైతులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలసి సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని లోకేష్ భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story