Kadapa: వడగండ్ల వర్షం.. 130 గొర్రెలు మృతి

by srinivas |
Kadapa: వడగండ్ల వర్షం.. 130 గొర్రెలు మృతి
X

దిశ, కడప: ఆకాల వర్షంతో మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరుకు చెందిన ఆరుగురు రైతులు గొర్రెల మేత కోసం పెద్దముడియం మండలం పాలూరు గ్రామ పంట పొలాల్లోకి తీసుకెళ్లారు. అయితే ఒక్కసారిగా వర్షం పడటంతో అక్కడే చిక్కుకుపోయారు. విపరీతమైన గాలితో కూడిన వడగండ్ల పడటంతో చిన్న గొర్రెపిల్లలు 83, పెద్ద గొర్రెలు 47 మొత్తం దాదాపు 130 గొర్రెలు చనిపోయాయి. దీంతో అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టంపై అంచనా వేశారు. పశువుల ప్రాణనష్టం నమోదు వివరాలు ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు.Next Story

Most Viewed