Yuvagalam: ప్రొద్దుటూరులో లోకేష్ దృష్టికి సమస్యల వెల్లువ

by Disha Web Desk 16 |
Yuvagalam: ప్రొద్దుటూరులో లోకేష్ దృష్టికి సమస్యల వెల్లువ
X

దిశ, కడప: రెండు రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. దీంతో ప్రొద్దుటూరు నియోజకవర్గం పసుపు మయంగా మారింది . ప్రొద్దుటూరులో గురువారం టీడీపీ శ్రేణులు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ను చూసేందుకు , సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, వృద్ధులు , యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పట్టణాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలల్లో నెలకొన్న డ్రైనేజ్, పారిశుధ్యం, తాగునీరు, అధికార పార్టీ నాయకుల వేధింపులను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అందరి సమస్యలు ఓపికగా వింటూ భరోసా కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంజనేయ స్వామి గుడి వద్ద నిరుద్యోగులు వినతి పత్రం సమర్పించి తమను ఆదుకోవాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని కోరారు.


చేనేత సామాజిక వర్గీయులు కలసి తమ సమస్యలను తెలియపరచి తమ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. చేనేత ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి జాతీయస్థాయి మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. టిడిపి అధికారంలోనికి వచ్చిన వెంటనే చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ ఐక్యంగా ఉంటూ టిడిపి విజయానికి కృషి చేయాలన్నారు . పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పట్టణ ప్రముఖులు లోకేష్‌ను కలసి పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలంటూ వినతి పత్రం అందజేశారు. రానున్నది తమ ప్రభుత్వమేనని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. అమ్మవారి శాల వద్ద యువనేతను ఆర్యవైశ్యులు కలసి తమ సమస్యలు తెలియపరచి పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. అధికారం వచ్చిన వెంటనే పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.


Next Story