టీడీపీ మహానాడు ఏర్పాట్లు వేగవంతం

by Jakkula Mamatha |
టీడీపీ మహానాడు ఏర్పాట్లు వేగవంతం
X

దిశ, కడప: కడప జిల్లాలో ఈ నెల(మే) 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం చేపట్టిన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను సోమవారం టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. చింతకొమ్మదిన్నె మండలం లోని పబ్బాపురం గ్రామం సమీపంలో మాహానాడు మైదాన అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భూమి పూజ అనంతరం వేగంగా కొనసాగుతున్న మహానాడుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కడపలో నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని కూడా శ్రీనివాస్ రెడ్డి సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.



Next Story

Most Viewed