Idupulapaya ట్రిపుల్ ఐటీలో విషాదం

by Disha Web |
Idupulapaya ట్రిపుల్ ఐటీలో విషాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (Idupulapaya IIT)లో విషాదం చోటు చేసుకుంది. ట్రిపుల్ ఐటీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన ట్రిపుల్ ఐటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన ఈశ్వర్ కుటుంబ సమస్యలు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. ఆత్మహత్య కారణాలను సూసైడ్ నోట్‌లో రాశారని, అందులో కుటుంబ సమస్యలను ప్రస్తావించినట్లు ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు

Next Story

Most Viewed