Ys Vivekha Murder Case: కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ను విచారించిన సీబీఐ

by Disha Web Desk 16 |
Ys Vivekha Murder Case: కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ను విచారించిన సీబీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో : దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పని చేసే నవీన్‌‌ను సీబీఐ విచారించింది. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రాగారంలో సీబీఐ ఇద్దరిని విచారించింది. కాల్ డేటా ఆధారంగా పలు అంశాలపై ఆధారాలను సేకరించింది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించిన సీబీఐ ఇటీవలే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించించింది.

ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి కాల్ డాటాకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. వివేక హత్య జరిగిన సమయంలో అవినాశ్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడాడనే విషయంపై ఫోకస్ పెట్టింది. అతని కాల్ డేటా ఆధారంగా అవినాశ్ రెడ్డి ఎక్కువ కాల్స్ నవీన్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఫోన్ నంబర్‌కు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అయితే నవీన్ వైఎస్ భారతి ఇంట్లో పని చేసే వ్యక్తిగా సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో విచారణకు నోటీసులు ఇచ్చింది. అలాగే సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో ఇద్దర్నీ సీబీఐ అధికారులు విచారించింది.


Next Story