Breaking: ప్రశ్నిస్తే అరెస్ట్.. మీరు ముమ్మాటికీ నియంతలే.. ఏపీసీసీ చీఫ్

by Disha Web Desk 3 |
Breaking: ప్రశ్నిస్తే అరెస్ట్.. మీరు ముమ్మాటికీ నియంతలే.. ఏపీసీసీ చీఫ్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరోద్యుగుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది అని చూపిస్తూ పలు సభల్లో ఆమె ప్రస్తావించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే నిరుద్యోగుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆమె నేడు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. అయితే షర్మిల చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు నిన్నటి నుంటే పోలీసులు, ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నారు.

దీనితో ఆమె నిన్న సాయంత్రమే విజయవాడ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా ఈ రోజు ఉదయం గంటలకు ర్యాలీగా సెక్రటేరియట్ కి వెళ్లేందుకు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. దీనితో ఆ ర్యాలీని అడ్డుకునేందుకు వందలాది పోలీసు బలగాలు పార్టీ కార్యాలయం మోహరించి బారికేడ్స్ ను ఏర్పాటు చేశాయి. ఎవరు బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలనుండి పార్టీ కార్యాలయం దగ్గరకి వచ్చిన నేతలను లోపలికి తీసుకు వెళ్లేందుకు బయకు వచ్చిన CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని పోలీసులు అరెస్ట్ చేసారు.

ఇక ప్రభుత్వ తీరుపై అసహనానికి గురైన వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పీసంధించారు.తాను చేసిన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. తమ చుటూ వేలాది మంది పోలీసులను పెట్టారని.. ఇనుప కంచెలు వేసి తమని బందీలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. .నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేయిస్తూ.. తమని ఆపాలని చూస్తున్నారంటే ముమ్మాటికీ మీరు నియంతలే అని పోస్ట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకు మీ చర్యలే నిదర్శనం అని.. CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి అని పోస్ట్ లో రాసుకొచ్చారు.

Next Story