అర్థరాత్రి అత్యంత కిరాతకం.. నిద్రిస్తున్న యువకుడిపై కత్తులతో విరుచుకుపడిన దుండగులు

by srinivas |
అర్థరాత్రి అత్యంత కిరాతకం.. నిద్రిస్తున్న యువకుడిపై కత్తులతో విరుచుకుపడిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. భూ తగాదాలే కారణమని తెలుస్తోంది. ఎప్పటి నుంచో కాపు కాచిన ప్రత్యర్థులు రాత్రి శేషు ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రిస్తున్న శేషుపై కత్తులతో విరుచుపడ్డారు. అనంతరం అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారు. ఉదయం రక్తపు మడుగులో పడిన శేషును చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువకుడి హత్యలో ఇద్దరు, ముగ్గురు ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యకు సంబంధించి ఎవరిపైనైనా అనుమానం ఉందా అని బంధువులను అడిగి తెలుసుకున్నారు. దుండగులను ఎవరైనా చూసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అట్టివారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు శేషు ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కేసును త్వరలో ఛేదిస్తామని తెలిపారు.

Next Story