ఆ టీడీపీ నేతను టార్గెట్ చేసిన వైసీపీ: సంకెళ్లు రెడీ అవుతున్నట్లేనా?

by Disha Web Desk 21 |
ఆ టీడీపీ నేతను టార్గెట్ చేసిన వైసీపీ: సంకెళ్లు రెడీ అవుతున్నట్లేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హాయాంలో టీడీపీ నేతలు చాలా మంది జైలుపాలయ్యారు... అరెస్టులయ్యారు...కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులతోపాటు పట్టాభిరామ్ వంటి నేతలు సైతం జైలుపాలయ్యారు. మరికొంతమంది నేతలు అరెస్టులయ్యారు. ఇంకొంతమంది ఇప్పటికే కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ కుట్రలు పన్ని తమపై కేసులు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా మాజీమంత్రి,టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి సైతం చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మంత్రి రోజాను ఉద్దేశించి మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అసభ్యపదజాలం ప్రయోగించారని..మంత్రిపై ఆయన చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని డీజీపీకి లేఖ సైతం రాసేశారు. మరోవైపు మంత్రి రోజా నీలి చిత్రాల్లో నటించిదంటు మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు నగరం పాలెంలో న్యాయవాదులు అన్నారు. బండారు సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులను గమనిస్తే బండారు సత్యనారాయణ సైతం అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వైసీపీ శ్రేణులైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి వార్నింగ్ సైతం ఇస్తున్న సంగతి తెలిసిందే.

బండారు చేసిన వ్యాఖ్యలివే

ఎన్టీఆర్ కుటుంబం సభ్యులపై మంత్రి ఆర్ కే రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహంతో రగిలిపోయారు. పెందుర్తిలో ప్రెస్‌మీట్ పెట్టి ఘాటు విమర్శలు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులపై విమర్శలు చేసే స్థాయి రోజాకు లేదని బండారు అన్నారు. నందమూరి బాలకృష్ణ,నారా భువనేశ్వరి,నారా బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత ఎంతమాత్రం రోజాకు లేదని ధ్వజమెత్తారు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియనిది కాదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక సంప్రదాయమైన కుటుంబం గురించి నువ్వు మాట్లాడటమెంటి..? అని ఘాటు విమర్శలు చేశారు. ఒక పనికిమాలిన, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ రోజాకు సపోర్ట్ చేస్తున్నాడు. మహిళలకు గౌరవమిచ్చే పార్టీ మాది. అందుకే నీ చరిత్ర బయట పెట్టడం లేదు అని తెలిపారు. రోజా 24 గంటల్లోగా నందమూరి, నారా కుటుంబాలకు క్షమాపణ చెప్పకపోతే నీ చరిత్రను బయట పెడుతా అని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్ చేయాల్సిందే: వాసిరెడ్డి పద్మ

రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే మంత్రి రోజాపై మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రెస్‌మీట్లో ఉపయోగించిన పదజాలం చాలా జుగుప్సాకరంగా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి పై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆమె కోరారు. ఇప్పటికే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి లేఖ రాశారు. మంత్రి ఆర్‌కే రోజాపై బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్‌లు పెట్టి బండబూతులు మాట్లాడుతున్నారని వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కె.జయశ్రీ, గజ్జల లక్ష్మి, గెడ్డం ఉమ, బూసి వినీత, రోఖయా బేగం మంత్రి రోజాకు సంఘీభావం ప్రకటించారు. బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


న్యాయవాదులు సైతం ఫిర్యాదు

మంత్రి ఆర్‌కే రోజా నీలి చిత్రాల్లో నటించిదంటూ మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు.బ్రహ్మ రెడ్డి అన్నారు. బండారు సత్యనారాయణమూర్తి వెంటనే మంత్రి రోజాకి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గపడేలా ఉన్నాయన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల వద్ద మెప్పు పొందాలి అనుకుంటే వాళ్ళకి ఉడిగం చేసుకో..టీడీపీలో పదవులు కావాలి అంటే వాళ్ళ కాళ్ళు పట్టుకో.. అంతేగానీ మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ఉండే విధంగా ప్రవర్తన ఉండాలి అని సూచించారు.

రంగంలోకి రాంగోపాల్ వర్మ

మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తొలుత ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా మహిళా కమిషన్ కర్తవ్యాన్ని గుర్తు చేశారు. అంతేకాదు తాను చేసిన పోస్టును జాతీయ మహిళా కమిషన్‌కి కూడా ట్యాగ్ చేశాడు. అలాగే మంత్రి ఆర్‌కే రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల వీడియోని సైతం షేర్ చేశారు. దీంతో మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించి అరెస్ట్ చేయాలంటూ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed