ఆర్దబ్ల్యూఎస్ ఆఫీస్ కి తాళం వేసిన వైసీపీ సర్పంచులు..కారణం ఇదే..!

by Disha Web Desk 3 |
ఆర్దబ్ల్యూఎస్ ఆఫీస్ కి తాళం వేసిన వైసీపీ సర్పంచులు..కారణం ఇదే..!
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ఎదో ఒక చోట వైసీపీకి నిరసనల సెగ తాకుతోంది. ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యాలంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. తాజాగా చిత్తూరులో వైసీపీ నేతలే సొంత పార్టీని విమర్శిస్తూ ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నీటిని అందించేందుకు నీటి సరఫరా మరియు పారిశుధ్యం కార్యాలయాలను ఏర్పాటు చేశారు(రూరల్ వాటర్ సప్లై).

ఈ కార్యాలయాల ద్వారా గ్రామీణ ప్రజలకు కావాల్సిన నీటిని అందిస్తారు. అయితే మొదట నీటిని సరఫరా చేసేందుకు తమ సొంత డబ్బులను వ్యచించి పనులు చెయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత నీటి సరఫరాకు ఎంత ఖర్చు అయ్యితే అంత నగదును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాగా చిత్తూరు జిల్లా లోని కుప్పం నియోజకవర్గంలో గత కొంతకాలంగా నీటి సరఫరా చేస్తున్న వ్యక్తులకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం మంజూరు చెయ్యలేదు.

ఎన్నిసార్లు అడిగిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్దబ్ల్యూఎస్ ఆఫీస్ కి వైసీపీ సర్పంచులు తాళం వేసి నిరసన చెప్పట్టారు. తాము అన్ని విధాలా నష్టపోయాం అని.. బిల్లులు రాక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని న్యాయంగా తమకు రావాల్సిన బిల్లులను మంజూరు చేయాల్సిందిగా కోరారు.

ట్యాంకర్ల ద్వారా సప్లై చేసిన నీటికి వెంటనే బిల్లులు చెల్లించాలని అలానే నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. మాకు న్యాయం కావాలి అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇక పలుమార్లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్దిని కలసి తమ సమస్యను తెలిపిన ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని.. బిల్లులు మంజూరు కాలేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed