వైసీపీ ఆపరేషన్ గన్నవరం: రంగంలోకి జగన్.. యార్లగడ్డకు షాక్

by Disha Web Desk 21 |
వైసీపీ ఆపరేషన్ గన్నవరం: రంగంలోకి జగన్.. యార్లగడ్డకు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు వైసీపీని వీడకుండా ఉండేందుకు రంగంలోకి దిగింది. నియోజకవర్గంలో పార్టీ బలహీనపడకుండా ఉండేందుకు కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు వెంట ఇంకో వైసీపీ నేతలెవరూ టీడీపీలోకి వెళ్లకుండా ఉండేందుకు బ్రేక్‌లు వేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేత దుట్టా రామచంద్రారావు టీడీపీలో చేరకుండా ఉండేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే దుట్టా రామచంద్రరావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంట టీడీపీలోకి వెళ్తారనే ఉద్దేశంతో ముందే వైసీపీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో దుట్టా రామచంద్రరావు కుటుంబం ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. కుటుంబ సమేతంగా దుట్టా రామచంద్రరావు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎల్లప్పుడు వైసీపీలోనే ఉంటామని ప్రకటించారు. వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పుకొచ్చారు. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు అని.. త్వరలో మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల లో పార్టీని మరింత బలోపేతం చేద్దాం..వైఎస్ జగన్‌ను గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి 45 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తాము ఎప్పటికీ పార్టీ వీడేది లేదు మారే ఆలోచన రాదు అని చెప్పుకొచ్చారు. గన్నవరంలోని మన పార్టీ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామన్నారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు మీరు ఎవ్వరు అధైర్య పడవద్దు అని అన్నారు. పార్టీలో ఎవరు ఉన్న లేకున్నా మన పార్టీ వైసీపీనేనని దుట్టా రామచంద్రరావు చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed