Delhi:‘అరేయ్ కూర్చో రా’ అంటూ పార్లమెంట్ సాక్షిగా రామ్మోహన్ నాయుడు పరువు తీసేసిన మిథున్ రెడ్డి

by srinivas |
Delhi:‘అరేయ్ కూర్చో రా’ అంటూ పార్లమెంట్ సాక్షిగా రామ్మోహన్ నాయుడు పరువు తీసేసిన మిథున్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ‘అరేయ్ కూర్చోరా బాబూ నువ్వు మాట్లాడావ్ కూర్చో’ అంటూ టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పట్ల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమర్యాదగా మాట్లాడారు. సాక్షాత్తూ పార్లమెంట్ సమావేశాల్లో రామ్మోహన్ నాయుడుపై మిథున్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ‘రేయ్ కూర్చోరా బాబూ’ అంటూ రెండుసార్లు అవమానకరంగా మాట్లాడారు. తోటి సభ్యుడు అని కూడా చూడకుండా రామ్మోహన్ నాయుడును తీసిపారేసిట్టు చేయి చూపుతూ మిథున్ రెడ్డి అవహేళన చేశారు.

కాగా చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రధాని మోదీ, కేంద్రమంత్ర అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. దీంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అన్ని అధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందని చెప్పారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఐటీ శాఖ చంద్రబాబు పీఏకు నోటీసులు ఇచ్చిందని, అయితే ఆయన పరారీలో ఉన్నారని మిథున్ రెడ్డి తెలిపారు.

అయితే మిథున్ రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి చంద్రబాబును అరెస్ట్‌ చేయించిందని నినాదాలు చేశారు. దీంతో మిథున్ రెడ్డి ‘అరేయ్ నువ్వు కూర్చోరా బాబు నువ్వు మాట్లాడింది అయిపోయిందని.. రామ్మోహన్ నాయుడును రెండుసార్లు అరేయ్’ అంటూ సంభోదించారు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలందరూ షాక్‌కు గురయ్యారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని మరో ఎంపీ అరే అని అనడమేంటని చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి తీరును టీడీపీ ఎంపీలు తప్పుబట్టారు. పార్లమెంట్ అని కూడా చూడకుండా మిథున్ రెడ్డి అధికార అహంకారంతోనే అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నోరు తెరిస్తే బూతులు తప్ప నిజాలు రావని మండిపడ్డారు. ఏపీ పరువును మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టిందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.Next Story

Most Viewed