ఎన్ని కేసులు పెట్టినా భయపడను: నోటీసులపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్

by srinivas |
ఎన్ని కేసులు పెట్టినా భయపడను: నోటీసులపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(YCP MLC Duvvada Srinivas)కు షాక్ తగిలింది. పోలీస్టేషన్‌కు రావాలని నోటీసులు జారీ చేశారు. జగన్ ప్రభుత్వ హయాం(Ys Jagan Government)లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌(Janasena party chief Pawan Kalyan)ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసి 41ఏ నోటీసులు అందజేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను, దివ్వెల మాధురి(Divvela Madhuri)ని కొందరు కూటమి నేతలు, కార్యకర్తలు దుర్భాషలాడారని దువ్వాడ తెలిపారు. అంతేకాకుండా ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని చెప్పారు. తనను బెదిరించిన వారిపై పోలీసులుకు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని దువ్వాడ శ్రీను దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story