వైసీపీ MLC Anantha Babu ఇంట తీవ్ర విషాదం..

by Disha Web Desk 19 |
వైసీపీ MLC Anantha Babu ఇంట తీవ్ర విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మంగారత్నం కన్నుమూశారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు.. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగారత్నంకు అనంతబాబు ఒక్కడే కావడంతో.. తల్లికి కొరివి పేట్టేందుకు అనుమతి ఇవ్వాలని అతడి కుటుంబ రాజమండ్రి జైలు అధికారులను కోరారు. కానీ, కోర్టు అనుమతి లేకుండా తాము అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో కోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్ వేసేందుకు అనంతబాబు కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.



Next Story

Most Viewed