టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే..

by Disha Web Desk 5 |
టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపధ్యంలోనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్ధసారథి టీడీపీలో చేరకముందే టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి జాబితాలో నూజివీడు టికెట్ దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా పార్ధసారథి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో నాకు టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని, పార్టీ నిర్ణయం ప్రకారమే నూజివీడు వెళ్తున్నానని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోటీ 30 లక్షల మందితో సర్వే చేయించి టికెట్లు ఇచ్చారని, నాన్ లోకల్ అయినా నూజివీడులో నాకు ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వైసీపీ నుంచి పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్ధసారథి వైసీపీ అధిష్టానం చేసిన ఇన్ చార్జిల మార్పులో భాగంగా పెనమలూరు సీటు కోల్పోయారు. పెనమలూరు టికెట్ మంత్రి జోగి రమేష్ కి వైసీపీ అధిష్టానం కేటాయించింది. దీంతో పార్ధసారథి టీడీపీ తీర్ధం పుచ్చుకోవాలిన నిర్ణయించుకొని, ఇవ్వాళ నారా లోకేశ్ సమక్షంలో ఆయన అనుచర వర్గంతో పాటు టీడీడీలో జాయిన్ అయ్యారు.


Next Story

Most Viewed