Ap News: దేశంలో జమిలి ఎన్నికలు..వైసీపీ నేతల రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 16 |
Ap News: దేశంలో జమిలి ఎన్నికలు..వైసీపీ నేతల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు బీజేపీ ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోనూ జమిలి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, పార్టీలు ఇప్పటికే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుకుంటున్నాయి. దీంతో జమిలి ఎన్నికలు జరిగినా ఆయా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అర్థమవుతోంది. అయితే వైసీపీ నేతలు జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘జమిలి ఎన్నికల వల్లే మంచే జరుగుతుంది. కానీ మన దేశంలో సాధ్యంకాదు. ప్రాంతీయ పార్టీలతో కేంద్రప్రభుత్వం సంప్రదింపులు జరపాల్సింది. జమిలి ఎన్నికలతో అన్ని పరిష్కారం కావు. అమెరికా లాంటి దేశంలో రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ జమిలి ఎన్నికలు ఉపయోగకరమవుతాయి.’ అని అన్నారు.

మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. రెండు, మూడు నెలల ముంద ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. జమిలి ఎన్నికలపై సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వన్ నేషన్- వన్ ఎలక్షన్ ఆలోచనల మంచిదే.’అని చెప్పారు.

మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ ‘జమిలి ఎన్నికలు దేశానికి ఉపయోగకరమే. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం.’ అని అన్నారు.

Next Story