Ycp: జగన్ ఫొటో మార్ఫింగ్.. టీడీపీ సోషల్ మీడియాపై అంబటి ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

సోషల్ మీడియా పోస్టులపై టీడీపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది...

Ycp: జగన్ ఫొటో మార్ఫింగ్.. టీడీపీ సోషల్ మీడియాపై అంబటి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై టీడీపీ(Tdp)కి వైసీపీ(Ycp) స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తమ అధినేత వైఎస్ జగన్‌(Ys Jagan)పై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు(Telugu Desam Party Social Media) అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు రివర్స్ ఎటాక్‌కు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసినట్లుగానే టీడీపీ వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

టీడీపీ సోషల్ మీడియా పోస్టులను కట్టడి చేసేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) తాజాగా రంగంలోకి దిగారు. మాజీ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు అసభ్య పోస్టులు పెట్టారని గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలు ఆధారాలను అందజేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను కోర్టుకెక్కుతానని అంబటి రాంబాబు హెచ్చరించారు. తమ పార్టీ నాయకుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టింగులు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలను చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం ట్విటర్‌లో ఆర్జీవీ పోస్టు పెడితే ఇప్పుడు ఆయన వెంటపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్‌గా జగన్ ఫొటో మార్ఫింగ్ చేసి ట్విటర్‌లో అసభ్య పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Next Story