తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

by Dishafeatures2 |
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
X

దిశ, మడకశిర: మడకశిర పట్టణంలో 5 వ వార్డు చీపులేటి లో తాగునీల్లు లేక దాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటి కోసం ఆమడ దూరం పరుగులు తీస్తున్నారు. వేసవి రాకముందే మంచి నీటి కోసం అన్ని వర్గాల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. తాగేందుకు దోసెడు నీళ్లు లేక నెల రోజుల నుంచి ప్రజలు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెడు నీటి కోసం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఒకపక్క అధికారులు మరోపక్క పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మంగళవారం శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఐదవ వార్డు చీపు లేటిలో కాలనీలో నెల రోజుల నుంచి త్రాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

బట్టలు ఉతుక్కోవడానికి స్నానం చేయడానికి నీరు లేక ఓపక్క అవస్థలు పడుతుంటే మరోపక్క దాహం తీర్చుకోవడానికి బిందెడు నీళ్లు కూడా అందడం లేదని మహిళలు యువతీ యువకులు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న సీమ కొట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఏ కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే తమ దృష్టికి తెస్తే పరిష్కారం చేస్తామని తప్పుడు సలహాలు ఇవ్వడం తప్ప చేసింది. లేదన్నారు. నెల రోజుల నుంచి మంచినీటి కష్టాలతో కన్నీరు కారుస్తున్న దయ తలిచే వారు లేరంటూ చెప్పలేనంత ఆవేదంతో విచారణ వ్యక్తం చేశారు.

సకాలంలో అధికారులు స్పందించి ఐదవ వార్డు చీపులేటిలో నెల రోజుల నుంచి నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలంటూ కాలనీ మహిళలు రోడ్డుపై కొచ్చి కాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టాల కడిలిలో అధికారులు పాలకులు స్పందించకపోవడం సిగ్గు చేటుగా ఉందని అన్ని వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తాగునీటి ఎద్దడిని పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.చి తమ వార్డు కు తాగునీరు అందించాలని అందించాలని చీపులేటి వార్డు ప్రజలు మహిళలు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed