తెలంగాణలో కాంగ్రెస్‌తో..ఏపీలో బీజేపీతోనా?:టీడీపీపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

by Disha Web Desk 21 |
తెలంగాణలో కాంగ్రెస్‌తో..ఏపీలో బీజేపీతోనా?:టీడీపీపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటించడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం రాజకీయ తప్పిదం అని చెప్పుకొచ్చారు. ఏపీలో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నట్ట కోందరు ఇటీవల కాలంలో ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ పొత్తుల వ్యవహారం తమ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసి..గాంధీ భవన్‌లో టీడీపీ జెండాతో తిరిగిన తెలుగుదేశం.. ఏపీలో బీజేపీతో ఎందుకు కలవాలి అనుకుంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు వారి పార్టీ సమాధానం చెప్పాలి అని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు మంచి ఫలితాలు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. ఇరు పార్టీలకు సంబంధించి ఓ వ్యూహం ఉందని దాని ప్రకారం ముందుకు వెళ్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed