మంగళగిరి సీటు గెలిపించి CM జగన్‌కు గిఫ్ట్ ఇస్తా: ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
మంగళగిరి సీటు గెలిపించి CM జగన్‌కు గిఫ్ట్ ఇస్తా: ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం హాట్ సీటుగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుండే పోటీ చేస్తుండటంతో.. మరోసారి మంగళగిరిలో లోకేష్‌ను ఓడించేందుకు జగన్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆర్కేను బరిలోకి దింపి లోకేష్‌ను ఓడించిన జగన్.. ఈ సారి బీసీ అభ్యర్థిని ప్రయోగించి లోకేష్‌కు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా ఆర్కేను తొలగించి టీడీపీ నుండి వచ్చిన గంజి చిరంజీవిను నియమించారు. లోకేష్‌కు చిరంజీవి గట్టి పోటీ ఇవ్వలేడని భావించిన జగన్ మరోసారి మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌ను మార్చాడు.

9వ జాబితాలో చిరంజీవిను తొలగించి మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా మురుగుడు లావణ్యను నియమించారు. ఈ క్రమంలో లావణ్య నియామకంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. లావణ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ నుండి వచ్చిందని తెలిపారు. మంగళగిరిలో ఈ సారి ఎన్నికలు నాన్ లోకల్ వర్సెస్ బీసీ అభ్యర్థి మధ్య పోటీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో మరోసారి నారా లోకేష్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. మంగళగిరి అసెంబ్లీ సీటు గెలిపించి అధినేత జగన్‌కు కానుకగా ఇస్తానని ఆర్కే అన్నారు.

Read More..

Breaking: సీఎం జగన్ పర్యటన వాయిదా

Next Story