బీసీ జనగణన గురించి ఢిల్లీలో జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: యనమల రామకృష్ణుడు

by Disha Web Desk 21 |
బీసీ జనగణన గురించి ఢిల్లీలో జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?: యనమల రామకృష్ణుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే బీసీల జన గణనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బీసీలకు తీరని ద్రోహం చేస్తోంది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ హయాంలో శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అని గుర్తి చేశారు. ఇప్పటి వరకు ఆమోదంపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అని నిలదీశారు. ఢిల్లీ పర్యటనలు, బీసీ జనగణన గురించి ఎందుకు మాట్లాడటంలేదు? జగన్‌కి బీసీల అభివృద్ధి ఇష్టంలేకే బీసీల జనగణనపై నిర్లక్ష్యం చేస్తున్నారు అని మండిపడ్డారు. బీహార్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జనగణన మొదలుపెట్టి పూర్తి చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్రమకేసులు, వేధింపులతో జగన్మోహన్ రెడ్డి మునిగి తేలుతున్నారు అని విమర్శించారు. తెలుగుదేశం మహానాడులో కూడా బీసీ జనగణనపై తీర్మానం చేయడం జరిగింది. బీసీ జనగణనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంటే పెత్తందార్ల కోసమే వైసీపీ పనిచేస్తోంది అని చెప్పుకొచ్చారు. బీసీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చి 139 కులాలకు టీడీపీ సమన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్‌లో కేటాయించిన నిధులను దారి మళ్లిస్తూ పెత్తందారులకు కాపలాదారుడిగా మారాడు అని చెప్పుకొచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం మురళీధర్ రావు కమిషన్ ను ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, చేతి వృత్తిదారులకు ప్రోత్సాహం, బీసీలకు సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ స్టడీ సర్కిళ్లు, బీసీలకు విదేశీ విద్య, ఆదరణ వంటి పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ జన గణన చేపట్టి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed