ఎస్సీ వర్గీకరణపై జగన్ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదు.?:మాజీమంత్రి కేఎస్ జవహర్

by Disha Web Desk 21 |
ఎస్సీ వర్గీకరణపై జగన్ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదు.?:మాజీమంత్రి కేఎస్ జవహర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎస్సీ వర్గీకరణపై సీఎం వైఎస్ జగన్ నోరు ఎందుకు మెదపడం లేదు అని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కులాలు మధ్య కుంపట్లరాజేసి చలికాచుకోవాలన్న జగన్ బుద్ధి నీచమైంది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు.సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్‌కు ఒక్కరూపాయి కూడా జగన్ ప్రభుత్వం కేటాయించలేదు అని మాజీమంత్రి కేఎస్ జహర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దళితుల అభివృద్ధిపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నది మరోసారి రుజువైంది అని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ రెడ్డి పూర్తి వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా ఎందుకు దానిపై జగన్ రెడ్డి స్పందించడం లేదు.? అని నిలదీశారు. దళితుల చిరకాల వాంఛ అయిన వర్గీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్న ద్రోహి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. వర్గీకరణపై నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా స్పందించలేదు అని మండిపడ్డారు. వర్గీకరణ సమస్య పరిష్కారానికి ఎందుకు ముందుకు రావడం లేదు.?అని విరుచుకుపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు, ఇతర ఉపకులాల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2001లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసింది టీడీపీనే అని చెప్పుకొచ్చారు. దీనివల్ల ఎస్సీల్లో అన్ని ఉపకులాల వారికి న్యాయం జరిగింది అని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం వారు ఎక్కువ ఉంటే..వారికి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు నాడు టీడీపీ ప్రభుత్వం జీ.వో నెంబర్ 25 తీసుకొచ్చింది అని గుర్తు చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా మాదిగ, ఇతర ఉపకులాల వారికి వివిధ శాఖల్లో 27 వేల ఉద్యోగాలు వచ్చాయి అని మాజీమంత్రి కేఎస్ జవహర్ చెప్పుకొచ్చారు.

ఎస్సీల నడ్డివిరుస్తున్న జగన్

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీల ఆర్థిక స్వావలంబన కోసం సబ్ ప్లాన్ ద్వారా రూ.40 వేల కోట్లకు పైచిలుకు ఖర్చు చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీమంత్రి కేఎస్ జవహర్ చెప్పుకొచ్చారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి 2.70 లక్షల మంది ఎస్సీ యువతకి స్వయం ఉపాధి కల్పించిన ఘనత టీడీపీకే చెల్లిందన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ఎస్సీలను ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే వైసీపీ చూస్తోంది అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం రద్దు చేయడం..ఆ వర్గాలకు వెన్నుపోటు పొడవడం కాదా.? మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్లకు కేటాయించలేదు అని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఒక్క రుణాల ద్వారా ఒక్క రూపాయి అయినా అందించారా.? కనీసం కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. రూ.28,149 కోట్ల సబ్ ప్లాన్ నిధులను ఎస్సీలకు దక్కకుండా చేసిన దళిత ద్రోహి జగన్ అని మండిపడ్డారు. వైసీపీలోని ఎస్సీ నాయకులపై వైసీపీ నేతలు పెత్తనాలు చేయడమేకాకుండా రాష్ట్రంలో ఇష్టారీతిన దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎస్సీని లోక్‌సభ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుది అయితే...తన ముందు కుర్చీలో కూర్చోనివ్వకుండా చేతులు కట్టుకునేలా చేసింది జగన్ అని చెప్పుకొచ్చారు. ఎస్సీల ఇళ్లకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ను చంద్రబాబు ఇచ్చారన్నారు. తాను అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక వేలకువేలు బకాయిల పేరుతో వసూలు చేస్తూ జగన్ రెడ్డి ఎస్సీల నడ్డి విరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు ఎదురుచూస్తున్నారు అని మాజీమంత్రి కేఎస్ జవహర్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed