24 సీట్లకు ఏ ప్యాకేజీ ఆపింది?.. మంత్రి రోజా హాట్ కామెంట్స్

by Disha Web Desk 5 |
24 సీట్లకు ఏ ప్యాకేజీ ఆపింది?.. మంత్రి రోజా హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నాడని, ఇప్పుడు 24 సీట్లకు ఏ ప్యాకేజీ ఆపిందని వైసీపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్నందుకు తెగ గింజుకున్నాడని, మనల్ని ఎవడ్రా ఆపేది అని డైలాగులు కొట్టాడని, ఇప్పుడు 24 సీట్లకు చంద్రబాబు ఆపాడా?, ప్యాకేజీ ఆపిందా? పవన్ కళ్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు.

175 స్థానాల్లో ముష్టి 24 సీట్లకు ఓకే చెప్పి వచ్చాడంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదని అన్నారు. ఆయన సోదరుడు చిరంజీవి ఉమ్మడి ఏపీలో 294 సీట్లలో పోటీ చేశారని, ఆ మధ్యలో 9 తీసేసి 24 సీట్లకు పవన్ ఓకే చెప్పాడని ఎద్దేవా చేశారు. పవన్ నిర్ణయంతో ఆయన మెగా అభిమానులకు, ఆ సామాజిక వర్గం వారికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదని, కావాలంటే వైసీపీలోకి వచ్చి తల పెట్టుకోవాలని బహిరంగంగా ఆహ్వానించారు. జనసేనలో ఉంటే ఎప్పుడు ఎవరి జెండా మోయాలో అర్ధం కాదని, వైసీపీకి వస్తే ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed