AP Politics:వైసీపీ అభ్యర్థుల పై ఒత్తిడి..కారణం ఏంటంటే?

by Disha Web Desk 18 |
AP Politics:వైసీపీ అభ్యర్థుల పై ఒత్తిడి..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయినా ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదనే చర్చలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలన్నీ ఎన్డీయే కూటమిదే గెలుపు అని అంచనా వేశాయి, దీంతో సీఎం జగన్ అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంట. పార్టీ అభ్యర్థులతో ఏమి చేస్తారో తెలియదు మీరు పక్కా గెలవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ పరిస్థితి ఏంటని తెలుసుకుంటున్నారంట. ఇక కొంతమంది అభ్యర్థులు అయితే అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండోసారి అధికారంలోకి రావడం కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని వ్యూహాలు, కుట్రలు పన్నినా విఫలం కావడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలవుతోందని టాక్ వినిపిస్తోంది. ఐదేళ్లలో గొప్పగా పాలించామని చెప్పుకుంటున్న సీఎం జగన్‌కు ఎన్నికల ఫలితాల్లో నిరాశ ఎదురైతే పార్టీ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో కొందరు సీనియర్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed