AP:పోలీసుల కస్టడీలో పిన్నెల్లి..రెండో రోజు విచారణలో ఏం చెప్పారంటే?

by Jakkula Mamatha |
AP:పోలీసుల కస్టడీలో పిన్నెల్లి..రెండో రోజు విచారణలో ఏం చెప్పారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లిని కస్టడీకి తీసుకున్న పోలీసులు లాయర్ సమక్షంలో సోమవారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని ఘటనకు సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి పిన్నెల్లి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సమాచారం. అసలు విషయంలోకి వెళితే..సీఐ పై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు పిన్నెల్లి మాట్లాడుతూ..పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.’ మొదటి రోజు 50 ప్రశ్నలు అడగ్గా వాటిలో 30 ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed