Ayyavaram: వామ్మో అటు వెళ్లొద్దు..!

by srinivas |
Ayyavaram:  వామ్మో అటు వెళ్లొద్దు..!
X

దిశ, ఏలూరు: ఏలూరు జిల్లా నుంచి ప్రయాణం ప్రారంభించిన పెద్దపులి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో సంచరించి తిరిగి ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల, పెదవేగి మండలాలకు చేరింది. పాదముద్రల ఆధారంగా పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఈ పెద్దపులి తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామం వైపు వెళ్ళిందనే సమాచారం గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తోంది.


సోమవారం పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. తగిన చర్యలు చేపట్టిన అతి త్వరలో పులిని బంధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాత్రులు బయటకు వెళ్లే వారు, పొలాల వద్ద పనులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుట్టాయగూడెం మండలం కోపల్లెలో సంచరించిన పులి కాకుండా రెండో పులి కూడా తిరుగుతోందనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed