ఉండి టీడీపీలో కలకలం.. రాజీనామా యోచనలో మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 16 |
ఉండి టీడీపీలో కలకలం.. రాజీనామా యోచనలో మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ఉండి టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే కేటాయిస్తూ తొలి జాబితా విడుదల చేశారు. దీంతో ఈ స్థానంపై ఆశపెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉండి నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున శివరామరాజు గెలుపొందారు. అయితే 2019లో రామరాజుకు ఆ స్థానం కేటాయించడంతో వైసీపీపై అభ్యర్థిపై ఆయన గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని శివ భావించారు. కానీ రెండోసారి కూడా రామరాజుకే చంద్రబాబు అవకాశం కల్పించడంతో శివరామరాజు మనస్థాపం చెందారు. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారైనా గెలవాలనే లక్ష్యంగా ఆ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన వర్గ విభేదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

రాయలసీమపై నారా లోకేశ్ ఫోకస్.. మార్చి 1 నుంచి శంఖారావం


Next Story