Nara lokesh: అభివృద్ధి, సంక్షేమం పరుగులెత్తాలి

by Disha Web Desk 16 |
Nara lokesh: అభివృద్ధి, సంక్షేమం పరుగులెత్తాలి
X

దిశ, ( ఉభయ గోదావరి ప్రతినిధి ): అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా జోడు గూర్రాల మాదిరిగా పరగులెత్తాలని, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రఢాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా పాలకొల్లు చేరుకున్న లోకేష్ అక్కడ రైతులతో బహిరంగ సభ నిర్వహించారు. తన పాదయాత్రలో చాలా చోట్ల పంటకాల్వలలో తూడు, డెక్క పెరిగిపోవడం చూశామని చెప్పారు. దీనివల్ల పంటలు ఇట్టే నీట మునుగుతున్నాయన్నారు. అన్నదాతలు అప్పుల పాలవ్వడానికి అసలు కారణం అదేనని లోకేష్ తెలిపారు.

యువగళంలో ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందని లోకేష్ విమర్శించారు. అసలు జగన్ పాదయాత్ర ఎలా చేశారని ప్రశ్నించారు. రైతుకు అవసరమైన పంట కాల్వల సమస్యను పట్టించుకోని ముఖ్యమంత్రి అవసరమా అని నిలదీశారు. రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ రాయితీ ఎత్తి వేశారని, గోదావరి జిల్లాలో పంట కాల్వలను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.

Next Story