Nara lokesh: యువగళం దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి

by Disha Web Desk 16 |
Nara lokesh: యువగళం దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి
X

దిశ, ( ఉభయ గోదావరి ప్రతినిధి): యువగళం దెబ్బకు ఫ్యాన్ రెక్కలు విరిగి పోయాయని, జగన్ ముఖం మాడిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. భీమవరంలో యువగళం పాదయాత్ర సాగింది.ఈ సందర్భంగా నిర్వహించిన బహరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. పాదయాత్రను ఆపడానికి సైకో జగన్ చాలా ప్రయత్నం చేశారని, వాటిని ప్రజా బలంతో అడ్డుకున్నామని అన్నారు. సైకో జగన్.. రాజారెడ్డి ఫాక్షనిజాన్ని ఫాలో అయితే తాము అంబేద్కరిజాన్ని ఫాలో అవుతున్నామని ఎద్దేవా చేశారు.

బాబాయిని చంపించిన జగన్ తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి చాలా తప్పులు చేశారని లోకేష్ తెలిపారు. అంతేగాక ఆ తప్పులు మేము చేసినట్లు రకరకాల ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము ఫ్లెక్సీలు వేయడం ప్రారంభిస్తే జగన్ కనుమరుగవుతారని హెచ్చరించారు. 12 కోట్లు ఖర్చు చేసి విలాసాలకు జగన్ లండన్ వెళ్ళారని ఆరోపించారు. జనం చాలా ఇబ్బందుల్లో ఉంటే జగన్‌కు విలాసాలు అవసరం వచ్చిందని అన్నారు. పచ్చని సీమలు ఉన్న గోదావరి జిల్లాల్లో కూడా జగన్ రౌడీ యుజం పెరిగిపోయిందని లోకేష్ మండిపడ్డారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story