కొత్తపేటలో సినీ నటుడు పృథ్వి సందడి

by Disha Web Desk 16 |
కొత్తపేటలో సినీ నటుడు పృథ్వి సందడి
X

దిశ, కొత్తపేట: సినిమా షూటింగ్ నిమిత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి వెళ్లిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ తిరుగు ప్రయాణంలో కొత్తపేటలో కొద్దిసేపు సందడి చేశారు. తన మిత్రుడు పెద్దింటి రామం స్వగృహానికి వెళ్లి ముచ్చటించారు . ఈ సందర్బంగా ఆయనను కొత్తపేట మండలం జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ వక్కపట్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చింతపల్లి సత్తిపండు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పృథ్వి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. జనసైనికులు అందరూ చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed