కువైట్ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

by srinivas |
కువైట్ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత
X

దిశ, నిడదవోలు: కువైట్ అగ్ని ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇరువురు మృతి చెందారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో మీసాల ఈశ్వరరావు, ఖండవల్లి గ్రామంలో మొల్లేటి సత్యనారయణ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేశ్‌ శనివారం వారి మృతదేహాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.Next Story

Most Viewed