పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్

by Disha Web Desk 18 |
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్
X

దిశ,పెనుగొండ:పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ చైతన్య కళాశాలలో మాస్ కాపీయింగ్ జరుగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా సుమారు 20 మంది పైబడి పరీక్ష కేంద్రం లోకి వెళ్ళి కాపీయింగ్ కు సహకరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.పరీక్షా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న యాజమాన్యంను ప్రశ్నించగా చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మాస్ కాపీయింగ్ కు సహకరిస్తూ సుమారు ఇరవై మంది లోపలికి వెళ్ళిన వెంటనే సిబ్బంది తలుపులు వేయగా పరీక్షలు జరుగుతుండగా పరీక్షా కేంద్రం కాంపౌండ్ లోకి ఎలా లోపలికి అనుమతి ఇచ్చారో చెప్పాలని మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ జవాబు దాటవేశారు.

మీడియా ప్రశ్నించడంతో అక్కడి నుంచి చైతన్య స్కూల్ టీచర్స్ ఉడాయించారు.ఎగ్జామ్స్ సెంటర్ జరిగే రూమ్ లో కిటికీ నుంచి స్లిప్పులు బుక్స్ బయటకు విసిరేసిన పరిస్థితి తలెత్తింది. కనీసం ఇన్విజిలేటర్ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో కష్టపడి చదువుకున్న (మెరిట్ స్టూడెంట్) విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తీసివేసి, కాపీయింగ్ కు సహకరిస్తున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed