టీడీపీ, జనసేన పొత్తు చారిత్రక అవసరం: కొణతాల

by srinivas |
టీడీపీ, జనసేన పొత్తు చారిత్రక అవసరం: కొణతాల
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తు చారిత్రక అవసరమని అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు తప్పదని.. అందరూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ, జనసేన కూటమి విజయవంతంగా ముందుకెళ్తోందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని కొణతాల పేర్కొన్నారు.

Next Story

Most Viewed