Apsrtc: మహా శివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు

by Disha Web Desk 16 |
Apsrtc: మహా శివరాత్రికి 120 ప్రత్యేక బస్సులు
X

దిశ, ఏలూరు: మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని జిల్లాలోని పట్టిసీమ, బలివే, తాడువాయి దేవాలయాలకు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా శాఖా అధికారి (డిపిటివో) ఆర్‌వీఎస్ కె. వరప్రసాద్ తెలిపారు. ఏలూరు డీపీటీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమ బలివే, తాడువాయి దేవాలయాలకు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసామని తెలిపారు. అదేవిధంగా ఏలూరు నుంచి శ్రీశైలం వయా తిరుపతి వరకు ఆన్ లైన్ సర్వీస్ బస్సులు ఏర్పాటు చేసినట్లు వరప్రసాద్ తెలిపారు.

జంగారెడ్డిగూడెం నుంచి 40 బస్సులు, ఐదు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రజా రవాణా శాఖా అధికారి కె. వరప్రసాద్ తెలిపారు.. ఏలూరు నుంచి బలివే వరకు 30 బస్సులు వయా విజయరాయి మీదుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏలూరు నుంచి శనివారపుపేట వేల్పుచర్ల మీదుగా బలివే వరకు 30 బస్సులు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రద్దీని బట్టి మరో 5 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. ఏలూరు నుంచి ద్వారకాతిరుమల వరకు ప్రత్యేక బస్సులతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా నిర్వహిస్తామని, భక్తులు ఈ సర్వీస్లన్నింటినీ వినియోగించుకోవాలని సూచించారు.

శివరాత్రి సందర్భంగా మొక్కులు తీర్చుకొని ప్రత్యేక దర్శనాలు చేసుకోవాలని కోరారు. నూజివీడు నుండి బలివే వరకు కూడా 30 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, ప్రయాణాలను సురక్షితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed