Ap News: పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
Ap News: పోలవరం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ,డైనమిక్ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో భాగంగా రూ.5338 కోట్ల వ్యయంతో చేపట్టిన 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీజెన్‌కో తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిస్తూ ఏపీజెన్‌కో ఆధ్వర్యంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఏపీజెన్‌కో ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రాజెక్టు పవర్ హౌస్ పునాది నిర్మాణం కోసం తవ్వకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొంత నిధులతోనే అమలు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం అందుకు నిధులేమీ కేటాయించడం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.


Next Story

Most Viewed