27న ఏలూరులో బీజేపీ బీసీ సభ.. గోడ పత్రిక ఆవిష్కరణ

by Disha Web |
27న ఏలూరులో బీజేపీ బీసీ సభ.. గోడ పత్రిక ఆవిష్కరణ
X

దిశ (కొత్తపేట): ఆలమూరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగే గోదావరి బీసీ సామాజిక చైతన్య సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినివిల్లి సత్తిబాబుగౌడ్, స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో బీసీ సామాజిక చైతన్య సభ గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు నాగిరెడ్డి స్వామి నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలూరి సత్యానందం మాట్లాడుతూ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు, జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, కేంద్ర బీసీ మంత్రులు వస్తున్నారని, సభను బీసీ సోదర, సోదరీమణులు, కుల సంఘ నాయకులు పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతను చాటి చెప్పాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు కార్పొరేషన్ల పేరుతో బీసీలను విడదీసారని, కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ చైర్మన్లకు విధులు, నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కేవలం కార్పొరేషన్ చైర్మన్లను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ బీసీలను ఆర్థికంగా ఎదుగులను అడ్డుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఏడిద గోపాలచార్యులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్డీ దొర నాయుడు, బోలుసు శ్రీను, కొవ్వూరి సీతారామరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed