అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు

by Jakkula Mamatha |
అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు
X

దిశ, కుక్కునూరు: అదుపుతప్పి కారు పల్టీ కొట్టిన ఘటన ఆదివారం మండలంలోని కివ్వాక గ్రామంలో చోటు చేసుకుంది. కుక్కునూరు గ్రామానికి చెందిన వ్యక్తి భద్రాచలం వైపు వెళ్తున్న క్రమంలో కారు బోల్తా పడిందని తెలిపారు. కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతూ, అసంపూర్తిగా రహదారి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.

Next Story

Most Viewed