సీఎం జగన్ హయంలోనే ఇంటింటా సంక్షేమం..

by Disha Web Desk 18 |
సీఎం జగన్ హయంలోనే ఇంటింటా సంక్షేమం..
X

దిశ, కళ్యాణదుర్గం: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని జిల్లా ఎంపీ, కళ్యాణదుర్గం వైకాపా సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ మంత్రి అనంతపురం జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు జోరు పెంచుతుంది. ఆదివారం వారు ఇరువురు స్థానిక నాయకులతో కలిసి కంబదూరు మండలం పరిధిలోని కర్తనపర్తి , కొత్తూరు ,డిచెన్నేపల్లి, రాళ్లంతపురం, రాళ్లపల్లి పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన అభివృద్ధి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గూర్చి ప్రజలకు వివరించారు.

గ్రామాల్లో పర్యటించిన తలారి రంగయ్య , శంకర్ నారాయణ కు వైఎస్ఆర్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అనునిత్యం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేదల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను 98 శాతం నెరవేర్చిన మహోన్నత వ్యక్తి సీఎం జగన్ అయితే , గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు అని వారన్నారు. కావున ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed