ఈ ఏడాది తగ్గేదే లే అంటున్న భానుడు.. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!

by Jakkula Mamatha |
ఈ ఏడాది తగ్గేదే లే అంటున్న భానుడు.. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!
X

దిశ,వెబ్‌డెస్క్: వేసవి రాకముందే ఎండలు భగభగమండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎండలు దంచికొడుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు వాతావరణం(weather)లో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండల కారణంగా ఉక్కపోత మరో రెండు రోజులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలో రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. దీంతో వేడి పెరగనుంది. పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న(శనివారం) పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. ఈ క్రమంలో నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed