Vizianagaram: పలు రైళ్లు రద్దు

by srinivas |
Vizianagaram: పలు రైళ్లు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు అందిస్తున్నారు.

అయితే రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్ - విశాఖ, రాయగడ-విశాఖ, పలాస-విశాఖ, విశాఖ-గుణుపూర్, గుణుపూర్-విశాఖ, విజయనగరం-విశాఖ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

వీటితో పాటు గుంటూరు-విజయవాడ-విశాఖ మధ్య నడిచే పలు రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ-విశాఖ రత్నాచల్ ఎక్స్ ప్రెస్, విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ-విశాఖ మెమూ రైలు, విశాఖ- కాకినాడ మెమూ ట్రైన్, రాజమండ్రి -విశాఖ-రాజమండ్రి మెమూ స్పెషల్ రైళ్లు, గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్లు, కోరాపుట్-విశాఖ- కోరాపుట్ స్పెషల్ ట్రైన్స్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- పూరీ ఎక్స్ ప్రెస్, విశాఖ- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఇవాళ రద్దు చేశారు.

Advertisement

Next Story