పారామెడికల్ ఉద్యోగులకు క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 18 |
పారామెడికల్ ఉద్యోగులకు క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ
X

దిశ ప్రతినిధి, విజయనగరం:వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ప్రభుత్వం జారీ చేసిన యాక్ట్ కు అనుగుణంగా జీవో 30,31 ప్రకారం శనివారం రాత్రి ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం నుంచి అర్హులైన ఉద్యోగుల సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించారు. మొత్తం మొదటి జాబితాలో ఉన్న 100 మంది ఉద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కరరావు రెగ్యులర్ ఉత్తర్వులు అందజేశారు. వారిలో 70 మంది హెల్త్ అసిస్టెంట్లు, 12 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 10 మంది ఏఎన్ ఎం లు, 8 మంది ట్రైబల్ హెల్త్ అసిస్టెంట్లు వున్నారు.

ఈ సందర్భంగా రెగ్యులర్ అయిన ఉద్యోగులను డీఎంహెచ్ ఓ అభినందనలు తెలియజేస్తు, మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. పారా మెడికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి వి. వి. ఎస్. ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో హామీ మేరకు చిత్తశుద్ధితో అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపారని చెప్పారు. సబ్ కమిటీలో కీలక పాత్ర పోషించిన జిల్లా మంత్రి బొత్స సత్తిబాబుకు, వైద్య శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story