ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ తొలి విడతలోనే ఏపీ పోలింగ్ !

by Disha Web Desk 18 |
ఈ వారమే ఎన్నికల షెడ్యూల్ తొలి విడతలోనే ఏపీ పోలింగ్ !
X

దిశ ప్రతినిధి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది.ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను మార్చి పదో తేదీన ప్రకటించారు. అయితే ఈ సారి ఆలస్యం అయింది.ఎన్ని రోజులు అన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కశ్మీర్‌లో ఉండనుంది. అక్కడ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలమనేది మూడు రోజుల పర్యటనలో అంచనా వేయనుంది. తర్వాత ఒకటి రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించవచ్చు.

షెడ్యూల్‌ను మార్చి 14-16 తేదీల మధ్యన ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు అంచనా వేయగలిగే అవకాశం ఉందేమో అని కేంద్ర ప్రభుత్వం కోరింది. సాధారణంగా లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆరేడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు ఉంటాయి. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏప్రిల్‌ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే 'కోడ్'లోకి వస్తుంది.

Next Story

Most Viewed