Vizianagaram: జీపీఎస్ మాకొద్దు.. ఓపీఎస్ కావాలి

by Disha Web Desk 16 |
Vizianagaram: జీపీఎస్ మాకొద్దు.. ఓపీఎస్ కావాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీపీఎస్ మాకొద్దు.. ఓపీఎస్ కావాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జీపీఎస్‌ తమకొద్దని, ఓపీస్‌ కొనసాగించాలని కోరుతూ బుధవారం విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పి.రామచంద్రరావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ తీసుకొస్తామని ప్రకటించడం సరికాదని...పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 30 నుంచి 35 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలు అందించే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్‌ విషయంలో ప్రభుత్వం జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులను నష్టం కలిగించే విధంగా తీసుకొని రావడం సరికాదంటటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్‌వి.యుగంధర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.భూషణరావు (ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ), పివై.అనిల్‌ కుమార్‌ (ఉపాధ్యక్షులు) విజయనగరం అర్బన్‌ శాఖ అధ్యక్ష కార్యదర్శులు బి.బాల భాస్కరావు ఇతర ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed